NTV Telugu Site icon

Puja Khedkar: యూపీఎస్సీ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్ పిటిషన్

Iaspujakhedkar

Iaspujakhedkar

ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా బుధవారం విచారణకు రానుంది. పూజా ఖేద్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డిబార్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 31న మోసం మరియు ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేద్కర్ యొక్క ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని UPSC తాత్కాలికంగా రద్దు చేసింది.

అందుబాటులో ఉన్న రికార్డులను యూపీఎస్సీ జాగ్రత్తగా పరిశీలించింది. సీఎస్‌ఇ-2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె దోషిగా తేలింది. దీంతో ఆమెకు షోకాజు నోటీసు జారీ చేసింది. ఆమె స్పందించకపోవడ్ంతో వేటు వేసింది.