Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ
- ఘోర అమానుషం
- రిటైర్డ్ ఆర్మీ క్రూరత్వం
- జామకాయలు దొంగిలించిందని చిన్నారికి చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం సన్నగిల్లుతోంది. ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి ఇంటి ముందు ఉన్న జామ చెట్టు నుంచి కాయ కోసిందని.. ఓ మాజీ సైనికుడు అత్యంత దారుణంగా హింసించి గొలుసులతో బంధించి నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఓ చిన్నారి.. మాజీ సైనికుడి ఇంటి ముందు ఉన్న జామ చెట్టు నుంచి ఒక కాయ కోసింది. దీంతో అతడు చిన్నారిని పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి మెట్ల దగ్గర ఉన్న ఇనుప రాడ్డుకు గొలుసులు వేసి బంధించాడు. దీంతో చిన్నారి భయంతో విలవిలలాడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక చిన్నారి అల్లాడిపోయింది. దీన్ని గమనించిన రోహిత్ అనే యువకుడు సాహసం చేసి చిన్నారి దగ్గరకు వెళ్లగా… చేతులెత్తి దండం పెడుతూ తనను రక్షించాలంటూ బిగ్గరగా ఏడుస్తూ మొర్రపెట్టుకుంది. అయితే మాజీ సైనికుడు మాత్రం.. ఆమె జామకాయలు దొంగతనం చేసిందంటూ తన చర్యను సమర్థించుకుంటూ కనిపించాడు. యువకుడు తీసిన వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు.. చైల్డ్ ఆఫీసర్‌కు రోహిత్ ఫోన్ చేయడంతో సంఘటనాస్థలికి చేరుకుని చిన్నారిని గొలుసుల నుంచి విడిపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత కూరత్వమా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రూ.5 ఖరీదు చేసే జామ కోసం గొలుసులతో బంధిస్తారా? అంటూ మాజీ సైనికుడిపై మండిపడుతున్నారు.
⚠️TW: SENSITIVE VISUALS
In Una, Himachal Pradesh, a man tied up a young girl with ropes as punishment for picking guavas from his property, He later apologized after the video went viral.
pic.twitter.com/dWxsZORDjm— Ghar Ke Kalesh (@gharkekalesh) April 5, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!