Site icon NTV Telugu

PM Modi: ఎస్-400 ముందు ప్రధాని మోడీ.. పాక్, చైనా చెప్పిందంతా అబద్ధమే అని తేలింది..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పంజాబ్ అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఈ బేస్ కీలకంగా వ్యవహరించింది. అయితే, భారత ప్రధాని ఒక్క చర్యతో పాకిస్తాన్, చైనాలు చెబుతున్నవి అబద్ధాలని రుజువు చేశారు. చైనా నిర్మిత JF-17 యుద్ధ విమానాలు, రష్యా నిర్మిత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ పేర్కొంది. యుద్ధ విమానాలు, రాడార్ స్టేషన్లని ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. చైనీ మీడియా కూడా పాకిస్తాన్ అబద్ధాలకు ప్రాముఖ్యత ఇస్తూ, ఈ విషయాన్ని తన పత్రికల్లో పేర్కొంది.

Read Also: Operation Sindoor: భారత్ దాడిలో 11 మంది సైనికులు మరణించారు.. 78 మంది గాయపడ్డారు.. అంగీకరించిన పాక్

మంగళవారం, అదంపూర్ ఎయిర్ బేస్‌కి వెళ్లిన ప్రధాని మోడీ S-400 ముందు నిలబడి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఒక్క చర్యతో పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. గత వారం, పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టడంతో అదంపూర్ వైమానికి స్థావరం కీలక పాత్ర పోషించింది. అయితే, అదంపూర్ ఎయిర్ బేస్‌పై దాడి చేసి భారత వైమానిక ఆస్తుల్ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుగా పేర్కొంది. దీనిపై, అ దేశ ఆర్మీ మార్ఫింగ్ చిత్రాలను ఉపయోగించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా S-400 నిలిచింది. దీని పనితీరు అద్భుతంగా ఉందని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. ఈ వ్యవస్థని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. ప్రస్తుతం రష్యా S-500 వ్యవస్థపై పనిచేస్తోంది. దీనిని సంయుక్తంగా డెవలప్ చేయాలని రష్యా, భారత్‌కి ఆఫర్ ఇచ్చింది. ఇది ఒప్పందంగా మారితే , ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారత్ సొంతమవుతుంది.

Exit mobile version