Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. పాక్ మొత్తం బ్రహ్మోస్ పరిధిలో ఉంది..
- ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే..
- బ్రహ్మోస్ పరిధిలోకి మొత్తం పాకిస్తాన్..
- దాయాదికి రాజనాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
భారతదేశ శక్తికి బ్రహ్మోస్ ఒక చిహ్నం అని రాజ్‌నాథ్ అభివర్ణించారు. ‘‘బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు, ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక విశ్వాసానికి రుజువు. సైన్యం నుండి నావికాదళం,వైమానిక దళం వరకు, ఇది మన రక్షణ దళాలకు కీలక స్తంభంగా మారింది’’ అని ఆయన అన్నారు. ‘‘పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏమి జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే. భారతదేశం పాకిస్తాన్‌ను సృష్టించగలిగితే, సమయం వస్తే.. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా తెలివైనవారు’’ అని అవసరమైతే పాకిస్తాన్‌ను ముక్కలు చేస్తామని పరోక్షంగా రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ భారతీయులకు కొత్త విశ్వాసాన్ని కలిగించిందని, ప్రపంచానికి బ్రహ్మోస్ ప్రభావాన్ని చూపించిందని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేయడానికి భారతదేశం ఉపయోగించింది. పాక్ రాడార్లకు చిక్కకుండా అత్యంత ఖచ్చితత్వంతో బ్రహ్మోస్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!