NTV Telugu Site icon

S Jaishankar: పాకిస్తాన్‌తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్‌మెంట్..

S Jaishankar

S Jaishankar

S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ వారంలో భారత్‌పై ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

‘‘ ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించినంత వరకు, ఆర్టికల్ 370 పూర్తయింది. కాబట్టి, మేము పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాల గురించి ఆలోచించగలము అనేది సమస్య’’ అని ఈ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో భారత్ వ్యవహరించే తీరులో నిష్క్రియంగా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పదలుచుకున్నది ఏమిటంట, మనం నిష్క్రియంగా లేము, ఎదైనా సంఘటన ప్రతికూల లేదా సానుకూల దిశలో ఉన్నా కూడా మేము స్పందిస్తాము’’ అని అన్నారు.

Read Also: Sunita Williams : బిలియన్ల మేర నష్టం కల్గించిన సునీత విలియమ్స్ ప్రయాణం.. ఇప్పుడు బోయింగ్‎కు గుడ్ న్యూస్

పాకిస్తాన్‌తో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న జైశంకర్ మరోసారి తన వాడీవేడి మాటలతో ఆ దేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరిచే విషయంలో ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని చెప్పారు. ఉగ్రవాదం ఆ దేశంలో పరిశ్రమగా మారింది, అలాంటి బెదిరింపులని సహించేది లేదనేది భారతదేశ ప్రస్తుత మానసిక స్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే , బంగ్లాదేశ్‌లో పరిస్థితులు, ఆదేశంలో హిందువులపై టార్గెటెడ్ దాడులను ఆయన ప్రస్తావించారు. పొరుగుదేశాలు ఎప్పటికీ తికమక పెట్టేవే అని, ఏ పొరుగు దేశంలో సవాళ్లు లేవో చెప్పాలంటూ ఆయన పరస్పర ఆసక్తి, సహకారం ఆవశ్యకతని నొక్కి చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజుల మిగిలి ఉండటంతో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో కీలక పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్సులు పాకిస్తాన్‌తో దౌత్యసంబంధాలు, చర్చల జరపాలని కోరుకుంటున్నాయి. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం గురించి తన మానిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు.