Site icon NTV Telugu

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..వడ్డీ పై కేంద్రం ప్రకటన..

Epfo

Epfo

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది.. ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..

ఇకపోతే EPFO వడ్డీ రేటుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చి, 2023లో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచాలని కోరినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 8.10 వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి చర్చల అనంతరం ఆమోదం తెలిపింది..

అయితే గత ఏడాది అతి తక్కువ వడ్డీని ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది ఊరట కలిగించింది.. ఏకంగా 5% పెంచడం విశేషం..2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఇది గత నాలుగు దశాబ్దాల్లో కనిష్ట వడ్డీ రేటు. అంతకన్నా ముందు సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ.. ఖాతా దారులకు వడ్డీ తగ్గితే.. తమ కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది నాలుగు దశాబ్దాల్లోనే తక్కువ వడ్డీని ప్రకటించడం ఉద్యోగులను నిరాశపర్చింది. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.. అప్పుడే వడ్డీ మనకు చేరుతుంది..

Exit mobile version