ఇదెక్కడి మాస్ ‘రివెంజ్’ రా మావా.. 250 కుక్కలను చంపిన కోతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమాల్లో హీరో ఫ్యామిలీ ని విలన్స్ చంపేస్తే.. హీరో విలన్స్ ని చంపి రివెంజ్ తీర్చుకొంటాడు.. అందరికి తెలిసిందే.. కానీ ఎప్పుడైనా జంతువులు కూడా రివెంజ్ తీర్చుకున్న ఘటనలు చూసారా..? కనీసం విన్నారా..? అయితే మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన సోసివల్ మీడియాలో సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్‌గావ్‌లో గత నెలరోజులుగా కోతులు విశ్వ రూపం చూపిస్తున్నాయి. కుక్క కనిపించడం ఆలస్యం నోటికి కరుచుకొని చెట్లపైకి, ఇంటిపైకి తీసుకెళ్లి కిందపడేసి చంపుతున్నాయి.. కుక్కలను వెంటాడి మరి కోతులు చంపుతున్నాయి. ఇప్పటివరకు 250 కుక్కలను కోతులు చంపాయి. అయితే ఈ కుక్కల వేట కోతులు ఎందుకు మొదలుపెట్టాయి అని అంటే రివెంజ్ అంటున్నారు స్థానికులు.. ఏంటీ కోతులకు కూడా పగ ఉంటుందా..? అని నోరెళ్లబెడుతున్నా.. అది నిజమేనాని స్థానికులు తెలుపుతున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
నెల రోజుల క్రితం ఒక కోతి పిల్లను నాలుగు కుక్కలు కలిసి చంపేశాయి అంట.. తమ కోతిపిల్లను చంపడం కళ్లారా చూసిన మిగతా కోతులు వాటిపై పగ పట్టాయి. అప్పటినుంచి ఆ ఏరియాలో కుక్క కనిపించడం ఆలస్యం.. వాటిపై దాడి చేసి ఎత్తుకుపోయి చెట్లమీద నుంచి విసిరేసి చంపుతన్నాయి. ఇక మొన్నటికి మొన్న కోతులను పట్టుకోవడానికి అధికారులు రెక్కీ నిర్వహించగా ఒక్క కోతి కూడా బయటపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక మీమర్స్ ఈ వార్తతో మీమ్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదెక్కడి మాస్ రివెంజ్ రా మావా అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరి ఈ కుక్కల వేటను కోతులు ఎప్పుడు ఆపుతాయో చూడాలి.


తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..