NTV Telugu Site icon

Sanjay Raut: సంజయ్‌ రౌత్‌ కు ఈడీ షాక్.. మరోసారి సోదాలు

Sanjay Raut

Sanjay Raut

శివశేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇంట్లో ఉదయం 7గంటలనుండి సోదాలు నిర్వహించారు. పత్రాచాల్ భూముల కుంభకోణంలో సంజయ్ రౌత్ అవినీతికి పాల్పడ్దారనే అభియోగాలు ఉండటంపై ఆయన ఇంటిలో అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. సంజయ్ రౌత్ నివాసం వద్ద CRPF సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇంట్లో జులై 20వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో జులై 1న సుమారు 10గంటల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. జులై 20న బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చింది. జులై 27న తాజాగా సమన్‌ జారీ చేయగా, అదే కారణంతో దానిని దాటవేశారు. తాను ఢిల్లీలో ఉన్నానని, పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నానని సంజయ్ రౌత్ తెలిపారు. సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు ఈడీ గతంలో సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కుట్రగా పేర్కొన్న సంజయ్ రౌత్‌.. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో అటాచ్ చేసింది.

తప్పుడు ఆరోపణలు..సాక్ష్యాలతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారని, తను ఈడికి భయపడనంటూ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపికి లొంగిపోనని, ప్రాణం పోయినా శివసేన ను వీడే ప్రసక్తి లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Show comments