Site icon NTV Telugu

Muda Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు..

Ed

Ed

Muda Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు అయింది. ముడా కుంభకోణంపై కేసు నమోదు చేసినట్లు ఈరోజు (సోమవారం) ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్ర లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసినట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసును నమోదు చేశారు.

Read Also: Maharashtra: దేశవాళీ ఆవులను రాజ్యమాత- గోమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..

కాగా, ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అంతేకాదు.. ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపేందుకు ఇప్పటికే కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సైతం అనుమతిని ఇవ్వడంతో రాష్ట్రంలో తీవ్ర దుమారం కొనసాగుతుంది.

Exit mobile version