Site icon NTV Telugu

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..

Encounter

Encounter

Encounter: జమ్మూ కాశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు!

ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లతో కూడిన బలగాలు ఈ రోజు తెల్లవారుజామున హిరానగర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక నివాసులు సాయుధ వ్యక్తుల్ని గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సంఘటన స్థలానికి అదనపు బలగాలను తరలించారు.

Exit mobile version