Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత ఫిబ్రవరిలో చంపేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్ కొడుక అసద్ అహ్మద్, అతని అనుచరుడు గులాం కీలక నిందితులుగా ఉన్నారు. వీరిద్దరు ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో యూపీ ఎస్టీఎఫ్ టీం చేతిలో హతమయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఎస్టీఎఫ్ తో పాటు పోలీస్ అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు కూడా యోగీని కొనియాడుతున్నారు. తమ కొడుకుకు న్యాయం చేశారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం ఎన్ కౌంటర్ ను తప్పుబడుతున్నారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని వ్యాఖ్యానించారు. అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తప్పుడు ఎన్ కౌంటర్లు చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చుతోందని, కోర్టులను బీజేపీ ఏమాత్రం నమ్మడం లేదని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. దోషులను విడిచిపెట్టకూడదు, ఏది ఓప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు బీజేపీకి లేని అన్నారు.
Read Also: Yogi Adityanath: అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్.. ఎస్టీఎఫ్ టీంపై సీఎం ప్రశంసలు.. అత్యవసర సమావేశం..
ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. నిందితుడు అసద్ తండ్రి అతీక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో ప్రవేశపెట్టిన రోజే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా స్పందించారు. ఈ రోజు పోలీస్ ఎన్ కౌంటర్ లో అతిక్ అహ్మద్ కొడుకు, మరొకరు చనిపోవడంపై చర్యలు జరుగుతన్నాయని, వికాస్ దూబే ఘటన పునరావృతం అవుతుందన్న మా అనుమానం నిజం అయిందని, ఈ ఘటన వెనక పూర్తి నిజం ప్రజల ముందుకు రావాలంటే ఉన్నతస్థాయి విచారణ అవసరమని మాయావతి అన్నారు.