NTV Telugu Site icon

Jammu kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జేఎం తీవ్రవాదుల హతం

Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter

Encounter Breaks Out In Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో జైషే మహ్మద్(జేఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. బాముముల్లా జిల్లాలోొని మోడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి ముందు శుక్రవారం ఉదయం షోఫియాన్ జిల్లాలో కూడా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు చేపట్టిన భద్రతాబలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది.

Read Also: Dhoomam: ‘కెజిఎఫ్’ బ్యానర్ లో ‘పుష్ప’ విలన్..

అంతకుముందు మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో కూడా ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతబలగాలు. కుల్గాం జిల్లాలోని అవ్వోతు గ్రామంలో కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి సైన్యం జరిపిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి ఏకే రైఫిళ్లు, గ్రెనేడ్స్, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు కూడా జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని కుల్గాం జిల్లా టకియా గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ గనీ, మహ్మద్ ఆసిఫ్ వానీగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ సమయంలో లొంగిపోవాలని పదేపదే భద్రతాబలగాలు కోరినప్పటికీ ఉగ్రవాదులిద్దరూ.. వారిపైకి కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. అతన్ని అవంతిపోరాలోని 439 ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు.

మూడు రోజుల వ్వవధిలో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. కాశ్మీర్ లోయలో జైషే మహ్మద్ తో పాటు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. గతంలో పలువురు స్థానికేతరులతో పాటు, కాశ్మీర్ పండిట్లు, బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు, హిందువులే లక్ష్యంగా ఈ రెండు ఉగ్రవాద సంస్థలు కాల్పులు జరిపి వారిని చంపేస్తూ.. హైబ్రిడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ తో పాటు, టీవీ కళాకారిణి అమ్రీన్ భట్ ను కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఆ తరువాత కూడా బీహార్ కూలీలతో పాటు, బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు ఉగ్రవాదులు. అయితే ఈ ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదుల్ని వెతికి మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.

Show comments