Site icon NTV Telugu

Ram Mandir: ముస్లిం కరసేవకుడికి రామాలయ ఆహ్వానం.. ఎన్నో ఏళ్ల తపస్సు అని హబీబ్ భావోద్వేగం..

Karasevak

Karasevak

Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌ మీర్జాపూర్‌లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్‌కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.

తనకు శ్రీరాముడి అక్షింతలు అందాయని, 70 ఏళ్ల హమ్మద్ హబీబ్ అన్నారు. తాను కూడా కరసేవలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ జిల్లా యూనిట్‌లో వివిధ పదవుల్లో పనిచేశాని చెప్పారు. ఈ వేడుకలను టీవలో చూస్తానని, జనవరి 22 తర్వా రామాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.

Read Also: India-Maldives: ప్రధాని లక్షద్వీప్ టూర్‌తో మాల్దీవుల్లో ఎందుకు కలవరం.? అదును చూసి దెబ్బకొట్టిన మోడీ..

తాను ‘కరసేవక్’ అని, డిసెంబర్ 2, 1992లో తాను 5 రోజుల పాటు తన టీంతో అయోధ్యలోనే ఉన్నానని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో డిసెంబర్ 6, 1992లో దేశవ్యాప్త అల్లర్లు జరిగాయి. ఇది ప్రతీ ఒక్కరికీ కూడా చారిత్రాత్మ రోజని రామ మందిర ప్రారంభోత్సవం గురించి హబీబ్ చెప్పారు. ఎన్నో ఏళ్ల తపస్సు, యుద్ధం తర్వాత తమకు ఈ రోజు వచ్చిందని, నేను బీజేపీలో చాలా పాత కార్యకర్తనని, మరోసారి అయోధ్యలో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పారు. రాముడు తమ పూర్వీకుడని భావిస్తామని చెప్పారు.

మరోవైపు మీర్జాపూర్ పొరుగు జిల్లా వారణాసిలో ముస్లిం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ కార్యకర్త నజ్నీన్ అన్సారీ రామాలయ వేడుకపై సంతోషం వ్యక్తం చేశారు. మేము శ్రీరాముడి జ్యోతిని తీసుకువచ్చి కాశీలోని హిందూ, ముస్లిం కుటుంబాలకు అందిస్తామని అన్నారు. రాముడు మన పూర్వీకుడు మాత్రమే కాదు, ఆయన మనలో ఉన్నారు, మనం మతాన్ని మార్చగలం కానీ, పూర్వీకులను మార్చలేమని ఆమె అన్నారు.

Exit mobile version