NTV Telugu Site icon

Miss India 2023: మిస్ ఇండియా కావాలని భావిస్తున్నారా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా..!!

Femina Miss India

Femina Miss India

Miss India 2023: మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ తరహాలో ఇండియాలో అందమైన మహిళలందరూ మిస్ ఇండియాగా నిలవాలని ఆరాటపడుతుంటారు. మన దేశంలో గత ఆరు దశాబ్దాలుగా అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) నిర్వహించే ఈ పోటీలకు ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్‌లో ఈ అందాల పోటీలు ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా చలామణి అవుతున్నాయి. ఇప్పటివరకు 58 సార్లు ఈ పోటీలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో 59వ ఫెమీనా మిస్ ఇండియా 2023 పోటీలు మణిపూర్ వేదికగా జరగనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల అందెగత్తెలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. 2023 సంవత్సరానికి గానూ మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది.

Read Also: Mahesh Fans on Fire: దర్శకుడు వంశీ పైడిపల్లిపై మహేష్ ఫ్యాన్స్ అలక

ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అందమైన మగువలు మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే అవకాశముంది. అయితే అంతిమంగా 30 మంది అందగత్తెలతో తుది జాబితా తయారు చేసి ఫెమీనా మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ పోటీలలో పాల్గొనే వారి అర్హతలను ది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ పోటీలలో పాల్గొనే అందాల భామల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. 5.3 అడుగుల ఎత్తు, ఆపైన (హీల్స్ లేకుండా) ఉండాలి. బరువు 51 కేజీలకు మించకూడదు. అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండరాదు. గతంలో పెళ్ళి చేసుకుని విడిపోయినా అనర్హులే. ముఖ్యంగా భారతీయులై ఉండాలి. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్న వారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులవుతారు. ఆసక్తి ఉన్న వారు www.missindia.com వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.