Site icon NTV Telugu

PM Modi: కాసేపట్లో కేబినెట్ అత్యవసర భేటీ.. పహల్గామ్ ఘటనపై చర్చ

Modi2

Modi2

ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కాసేపట్లో మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి. కానీ మంగళవారం సాయంత్రం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో పర్యటన కుదించుకుని తిరిగి భారత్‌కు వచ్చేశారు.

Terror Attack: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రధాని మోడీతో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీనగర్ నుంచి అమిత్ షా పాల్గొ్న్నారు. ఇక పెరూ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హుటాహుటినా భారత్‌కు బయల్దేరారు. పహల్గామ్  ఉగ్ర దాడి ఘటన, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

Exit mobile version