NTV Telugu Site icon

Electric Vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్లకు చేరనున్న ఎలక్ట్రిక్ వాహనాలు

Ev S

Ev S

Electric Vehicles in India To Touch 5 Crore By 2030: భారత్ తో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు అమ్మకాలు పెరిగాయి. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. ప్రస్తుతం ఇండియాలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న ఈవీలు డిమాండ్, సరఫరాలకు అనుకూలంగా ఉండటంతో రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటుందని అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కూడా పెద్ద అవకాశంగా అభివర్ణించింది.

Read Also: Ganesh Chaturthi: వినాయకుడిని తాకిన ‘పుష్ప’ క్రేజ్.. వైరల్‌గా మారిన ‘పుష్ప’ వినాయకుడు

నివేదిక ప్రకారం.. క్రమంగా ఈవీలు జనాల్లోకి ప్రవేశిస్తున్నాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని తెలిపింది. మార్చి 2022 నాటికి ఇండియాలో ఈవీల సంఖ్య పది లక్షలను అధిగమించింది. ఈ సంఖ్య 2030 నాటికి 45-50 మిలియన్లకు అంటే దాదాపుగా 5 కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ ఎకో సిస్టమ్ కూడా మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1700 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయని.. ఇవి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోవు.. ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యాలను కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. ప్రభుత్వం కూడా బలంగా వీటని ఏర్పాటు చేయాలని చూస్తోందని నివేదికలో తెల్పింది.

కేపీఎంజీ నివేదిక ప్రకారం టూ వీలర్ విభాగంలో 2025 నాటికి 15-20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేయగా… 2030 నాటికి 50-60 శాతానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్యాసింజర్ వాహనాల విషయానికి వస్తే 2030 నాటికి 8-10 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. అదే విధంగా త్రిచక్ర వాహనాల్లో 2025 నాటికి 45-50 శాతం వృద్ధి ఉంటే 2030 నాటికి 90-95 శాతం గ్రోత్ ఉంటుందని అంచానా వేసింది.

Show comments