NTV Telugu Site icon

Electric Vehicles: ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదాలకు ఈ లోపాలే కారణం.. నిపుణుల కమిటీ గుర్తింపు

Ev Fire Accidents

Ev Fire Accidents

Electric Vehicles Fire Accidents: రానున్న రోజుల్లో పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజల్ని ఎలక్ట్రిక్ వాహనాల( ఈవీ )ల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది ప్రజలు పెట్రోల్ బాధలు తప్పుతాయని.. ఎలక్ట్రిక్ బైకులను, కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. కార్ల విషయంలో కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించి వినియోగదారులకు మెరుగైన ప్రొడక్ట్ అందించాయి. అయితే ఎలక్ట్రిక్ టూవీలర్లు మాత్రం అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో, బైక్ నడుపుతున్న సమయాల్లో ఎలక్ట్రిక్ బైకులు అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదాలపై నిపుణుల కమిటీని నియమించింది.

బ్యాటరీల నిర్వహణ వ్యవస్థ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఉపయోగించే సెల్స్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రమైన లోపాలను గుర్తించింది ఎక్స్ పర్ట్ కమిటీ. ఈ ఏడాది ప్రారంభంలో ఈవీ బైకుల వరస ప్రమాదాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని నియమించింది. నాసిరకం వాహనాలను విక్రయించిన మూడు ఈవీ తయారీ కంపెనీలపై భారీ జరిమానా వేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే సదరు ఈవీ కంపెనీలకు భారీ జరిమాని విధించింది ప్రభుత్వం.

Read Also: Russia will buy Rupees: మన కరెన్సీ రూపాయిని భారీగా కొననున్న రష్యా

తమిళనాడు వెల్లూర్ ఘటన తర్వాతా ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనే జరిగాయి. చాలా వరకు ఈవీలు షార్ట్ సర్క్యూట్, బ్యాటరీల్లో లోపాల వల్లే జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. వరస అగ్ని ప్రమాదాల తరువాత.. ఈవీ కంపెనీలు నిర్లక్ష్యానికి పాల్పడితే భారీ జరిమానాలతో పాటు రీకాల్ చేస్తామని గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉందని ఈవీ కంపెనీలకు హెచ్చరించారు. బ్యాటరీ భద్రతా ప్రమాణాలను నిర్థారించడానికి రవాణా మంత్రిత్వ శాఖ త్వరలోనే నిబంధనలు జారీ చేస్తుందని తెలుస్తోంది. భద్రతా ప్రమాణాల ప్రకారం.. ఛార్జింగ్ చేసే సమయంలో ‘‘ ఆటో కటాఫ్’’ ఫీచర్ ను తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం.