NTV Telugu Site icon

Prashant Kishor: వ్యూహం మార్చిన ప్రశాంత్ కిషోర్.. తమిళనాడులో విజయ్‌కు సాధ్యమేనా?

Prashantkishor

Prashantkishor

వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా కదనరంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజయ్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Bandla Ganesh: బండ్ల గణేష్ పాదయాత్ర

అయితే విజయ్‌కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లు ప్రచారం జరిగింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని.. ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంగా విజయ్ ఉండాలని సలహా ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏపీలో పవన్‌కల్యాణ్.. ఈ మాదిరిగానే అధికారంలోకి వచ్చారని సూచించినట్లుగా వార్తలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: Shamshabad Air Port: ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఔట్ పోస్ట్..

అయితే తాజాగా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయ్‌కి ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించినట్లుగా సమాచారం. ఇక విజయ్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఏఐఏడీఎంకే కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సూచనలతో 2026 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని విజయ్ వ్యూహం రచించినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు మరింత సమయం ఉండడంతో.. ఆ సమయానికి పరిణామాలు మారతాయా? లేదంటే పొత్తులు ఉంటాయా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: Vijayawada: ట్రాఫిక్ సీఐతో వాహనదారుడు వితండ వాదం.. ఐడీ కార్డు చూపించాలంటూ..!