ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈలోపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: కంత్రీ పోలీస్ జంట.. రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు
పార్లమెంట్ వర్షాకాల తొలిరోజు జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యంతో రాజీనామా చేసినట్లు రాష్ట్రపతికి లేఖ పంపించారు. కానీ ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో షాక్‌కు గురి చేసింది. ఇంత సడన్‌గా రాజీనామా చేయడంపై విపక్షాలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర పెద్దల వైఖరి కారణంగానే ధన్‌ఖర్ రాజీనామా చేశారని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: UP: హనీమూన్ మర్డర్ భయంతో ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమతిచ్చిన భర్త
ఇర పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోపే ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన వారు 5 ఏళ్లు పాటు పదవిలో కొనసాగనున్నారు. ఖాళీ అయిన రాజ్యాంగ పదవిని త్వరగా భర్తీ చేసే ఆలోచనలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రెండు వారాల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సుమారు 30 రోజుల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి.
ఇది కూడా చదవండి: Vice presidential poll: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్లియర్ మెజారిటీ.. లెక్కలు ఇవే..
ఇర పార్లమెంట్ ఉభయ సభలు లోకసభ, రాజ్యసభకు చెందిన సభ్యులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు కూడా ఉప రాష్ట్రపతిని ఎన్నుకునే ఓటర్లుగా ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఉపఎన్నిక నిర్వహించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరిలో ఉపరాష్ట్రపతి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఉపఎన్నిక నిర్వహించలేకపోతే పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకంగా మరోసారి ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. లేదంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ భవనాల్లో ప్రత్యేకంగా “బ్యాలెట్ బాక్స్” లను ఏర్పాటు చేయడం, ఓటింగ్ పూర్తవ్వగానే అన్ని రాష్ట్రాల నుంచి ఆ బాక్సులన్నింటినీ ఢిల్లీకి తీసుకురావడం పెద్ద ప్రహసనం అవుతుంది. అందుకోసమే ఈ సమావేశాలు పూర్తయ్యేలోపు ప్రక్రియను ముగించేయనున్నారు.
ఇక శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉండరు. తదుపరి శీతాకాలపు సమావేశాల వరకు వేచి ఉంటే నిబంధనల ప్రకారం సమయం సరిపోదు. నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి ఉపఎన్నికను నిర్వహించాలి. రాజ్యాంగ పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచడం కూడా సముచితం కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.
ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి రేసులో ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇంకొరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. చాలా కాలం నుంచి శశిథరూర్ బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు విదేశాల్లో దౌత్యానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా విదేశీ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక నితీష్ కుమార్ చాలా కాలంగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా అనేక సార్లు పని చేశారు. అయితే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తు్న్నారు. అంతేకాకుండా త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి వరకు బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎవరొకరి మద్దతుతోనే ప్రభుత్వంలో భాగస్వామి అవుతోంది. ఈసారి ఎలాగైనా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పా్టు చేయాలని అనుకుంటోంది. జేడీయూకు తక్కువ సీట్లు కేటాయించి.. బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీ చేసి గెలవాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా పంపించాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తు్న్నట్లు సమాచారం. అయితే ఈ ఊహాగానాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది.
