Site icon NTV Telugu

Bihar Elections: బీహార్‌లో యంగ్ ఓటర్లే అధికం.. ఈసారి ఎటువైపో..!

Biharelections

Biharelections

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దిగేశాయి. అధికారం కోసం ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. ముఖ్యంగా బీహార్‌‌‌లో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులపై పోకస్ చోటుచేసుకుంది. కారణం ఏంటంటే.. రాష్ట్రంలో యువత ఓట్లే కారణం. ఏ పార్టీ ఈ ఓట్లను క్యాష్ చేసుకుంటుందనేది అసలు విషయం.

తేజస్వి యాదవ్…
ఆర్జేడీ నేత, లూలూ కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లోనే అధికారం వచ్చినట్లే వచ్చి పోయింది. కేవలం 12,000 ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి తేజస్వి యాదవ్ యువ ఓటర్లను బాగా ఆకర్షించారు. అందుకు తగ్గట్టుగానే ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా యువ ఓటర్లే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో 18-35 సంవత్సరాల వయస్సు గల ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 70 శాతం ఓటర్లంతా యువకులే. ఈ ఓట్లతోనే ప్రభుత్వం ఏర్పడేది. అందుకే యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తేజస్వి యాదవ్ కసరత్తు చేస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్..
ఇక రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల కదనరంగంలోకి దిగారు. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈయన కూడా యువతే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. విద్య, ఉద్యోగాల సృష్టిపై పోకస్ పెట్టారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో బీహార్‌ను కార్మికుల రాష్ట్రంగా మార్చారని ఆరోపిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే.. యువత భవిష్యత్‌ను మారుస్తామని హామీ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టగా.. గతేడాది అక్టోబర్ 2న కొత్త పార్టీని స్థాపించారు.

కన్హయ్యకుమార్…
ఇక కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్ కూడా యువ ఓటర్లపైనే పోకస్ పెట్టారు. ఈసారి అధికారంలోకి వస్తే.. నిరుద్యోగుల భవిష్యత్‌ను మారుస్తామని హామీ ఇస్తున్నారు. వలసలు నివారించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇలా తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్, కన్హయ్య కుమార్.. యువ ఓటర్లే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: Water Mafia: సున్నం చెరువు చుట్టూ నీటి దందా..

 

Exit mobile version