హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రతినిధి బృందం కలవాలని లేఖలో కోరింది. హర్యానా ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలతో ఎన్నికల సంఘాన్ని కలవొచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల సంఘం గుర్తించిందని లేఖలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
మంగళవారం హర్యానాతో పాటు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే తొలుత హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అనంతరం కొన్ని నిమిషాలకే బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటి కమలం పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సొంతంగా 48 స్థానాలను గెలుచుకుంది. దీంతో ముచ్చటగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ జిమ్మిక్కులు చేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలంతా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఎన్నికల సంఘం గుర్తించి.. బుధవారం సాయంత్రం 6 గంటలకు కలవాలని ఆహ్వానించింది.
ఇది కూడా చదవండి: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే
ఇక జమ్మూకాశ్మీర్‌లో మాత్రం నేషనల్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం కూటమి ఎమ్మెల్యేలంతా ఒమర్ అబ్దుల్‌ను ఎన్నుకోనున్నారు.