NTV Telugu Site icon

Election Commission: వారికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్‌.. కోటి మంది ఓట్లు తొలగింపు..!

Election Commission

Election Commission

భారత ఎన్నికల కమిషన్‌ ప్రక్షాళన చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరివేస్తోంది.. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించే పనిలోపడిపోయింది.. గడిచిన ఏడు నెలల్లో ఇలా మొత్తంగా దాదాపు కోటి మంది పేర్లను జాబితా నుంచి తొలగించామని.. కొన్ని సరిచేశామని ప్రకటించింది ఎన్నికల కమిషన్… ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.. ఓటరు గుర్తింపు కార్డులు డెమోగ్రాఫికల్ లేదా ఫోటోగ్రాకల్ సారూప్య నమోదులను తొలగించడం ద్వారా సరిచేస్తూ వచ్చింది.. ఓటర్ల సమగ్ర డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నందున నకిలీ ఎంట్రీల తొలగింపుపై ఫోకస్‌ పెట్టింది ఎన్నికల కమిషన్‌..

Read Also: Komatireddy Rajagopal Reddy: వాళ్లకోసమే రాజీనామా.. ప్రజలు ఆలోచించాలి..

ఇక, ఓటర్ల జాబితాను సులభతరం చేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఓటరు గుర్తింపు కార్డులతో స్వచ్ఛందంగా ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతించింది. అయితే, ఇది, ఓటర్ల డెమోగ్రాఫిక్ మ్యాపింగ్‌ను అవకాశం ఇస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నరాయి. అంతే కాదు డేటా గోప్యతకు సంబంధించిన ఆందోళనలను కూడా లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది.

బూత్ స్థాయిలో ధ్రువీకరించుకున్న తర్వాతే జాబితానుంచి పేర్లను తొలగించినట్టు, స్వచ్ఛందంగా తొలగించలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇక ఫొటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా, తనిఖీ తర్వాత 98,00,412 ఓట్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. మొదటి దశలో, ఎన్నికలకు వెళ్లే ఐదు రాష్ట్రాలకు పీఎస్‌ఈ గణించబడింది… 2022లో ముసాయిదా ప్రచురణకు ముందు. రెండవ దశలో, మిగిలిన 32 రాష్ట్రాలకు పీఎస్‌ఈ గణించబడిందని అధికారులు వెల్లడించారు.. మొత్తం పీఎస్‌ఈ గుర్తించబడినవి 3.18 కోట్లు [రెండు దశల్లో 31 మిలియన్లకు పైగా] మరియు 98,00,412 మంది ఓటర్లు తొలగించబడ్డారు…. దాదాపు 20 లక్షల ఓట్లు సరిదిద్దే పనిలో ఉన్నట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ఆధార్‌ అనుసంధానంతో ఓటర్ల జాబితాలో సవరణలు మరింత వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.. ప్రస్తుతం దేశంలో దాదాపు 940 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు.

Show comments