Site icon NTV Telugu

SIR: 5 రాష్ట్రాలు, ఒక యూటీలో SIR గడువు పొడగించిన ఎన్నికల సంఘం..

Sir

Sir

SIR: కేంద్రం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పొడగించినట్లు ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో గడవును పొడగించింది. మరోవైపు..గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లకు ఓటర్ల నమోదు గడువు ఈరోజుతో ముగిసింది. ఈ రాష్ట్రాలకు ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు. బీహార్ ఎన్నికల తర్వాత, బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో SIR ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. బెంగాల్‌లో మమతా సర్కార్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Read Also: Mamata Banerjee: ‘‘BSF పోస్టుల వద్దకు మాత్రం వెళ్లకండి’’.. SIRపై మమతా సంచలన వ్యాఖ్యలు..

పొగడించిన ఓటర్ల నమోదు గడువులను పరిశీలిస్తే.. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు డిసెంబర్ 14, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు డిసెంబర్ 18 వరకు, ఉత్తర్ ప్రదేశ్‌కు డిసెంబర్ 26 వరకు. సవరించిన ముసాయిదా జాబితా ప్రచురణ తేదీలు- తమిళనాడు, గుజరాత్‌లకు డిసెంబర్ 19, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్‌లకు డిసెంబర్ 23, ఉత్తర్ ప్రదేశ్‌కు డిసెంబర్ 31.

Exit mobile version