Site icon NTV Telugu

ECI: రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం..

Rahulgandhi

Rahulgandhi

ECI: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన పదాలతో కూడిన సమాధానంలో పేర్కొంది.

Read Also: Murshidabad Riots: ముర్షిదాబాద్ అల్లర్లు.. తండ్రీకొడుకుల హత్యలో 13 మంది నిందితులు..

దీనికి ముందు, రాహుల్ గాంధీ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని, ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో పెంచారని ఆరోపించారు. ఈ వాదనలపై ఈసీ స్పందిస్తూ.. మొత్తం ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు హాజరైనట్లు పేర్కొంది. అసాధారణ ఓటింగ్ గురించి కాంగ్రెస్ అధీకృత ఏజెంట్లు ఎప్పుడూ ఎటువంటి అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు లేవనెత్తలేదని కమిషన్ పేర్కొంది.

ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని నియంత్రించే చట్టంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక ప్యానెల్ నుంచి తొలగించడం ద్వారా కేంద్రాన్ని అనుకూల ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలు ఆధారాలు లేనివని, గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన కొద్దిసేపటికే కాంగ్రెస్ లేవనెత్తిన అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు పోల్ ప్యానెల్ చెప్పింది. “ఎన్నికల కమిషన్ డిసెంబర్ 24, 2024న INCకి ఇచ్చిన సమాధానంలో ఈ వాస్తవాలన్నింటినీ బయటపెట్టింది, ఇది ECI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇలాంటి అంశాలను మళ్లీ మళ్లీ లేవనెత్తుతూ ఈ వాస్తవాలన్నింటినీ పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది…” అని ECI తెలిపింది.

Exit mobile version