NTV Telugu Site icon

Election Campaigning Ban: ఆ గ్రామంలో అట్లుంటది మరి.. ప్రచారంపై నిషేధం.. ఓటు వేయకపోతే ఫైన్‌..

Election Campaigning Ban

Election Campaigning Ban

ఏ ఎన్నికలైనా ప్రచారం హోరెత్తుతుంది.. ఇక, ప్రచారం తర్వాత ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది.. మాకు ఓటు వేస్తే ఇంత ఇస్తాం.. ఈ పనులు చేసిపెడతాం అనే వాళ్లు చాలా మందే మోపయ్యారు.. అయితే, వీటికి దూరంగా ఉంటుంది ఓ గ్రామంలో.. అంటే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటే.. ఓట్లను కూడా బహిష్కరించారా? ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, వీరు ఎన్నికల ప్రచారానికి మాత్రమే వ్యతిరేకంగా.. అందరూ ఓటు వేయాల్సిందే.. ఒకవేళ ఓటు వేయకపోతే ఆ గ్రామంలో ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది.. స్వాతంత్ర్య భారతంలో ఇంత చైతన్యం కలిగిన గ్రామం ఎక్కడుంది అనే వివరాల్లోకి వెళ్తే..

Read Also: Action on SI and Constable: డయల్ 100 కాల్‌పై నిర్లక్ష్యం.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ జిల్లాలో రాజ్‌ సమధియాల అనే గ్రామం ఉంది.. ఇక్క ఏ ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు… ఇదేదో ఇప్పుడే తీసుకున్న నిర్ణయం కాదండోయ్.. 1983 నుంచి దీనిని అమలు చేస్తూ వస్తున్నారు.. అంటే, ఎన్నికలు వచ్చాయంటే ప్రచారం.. ఆరోపణలు, విమర్శలు, హంగామా ఏదీ ఆ గ్రామంలో కనిపించదు.. అలాగనే ఓటు వేయడానికే ఆ గ్రామం దూరంగా ఉంటుందా? అంటే అది పొరపాటే.. ఎందుకంటే.. ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా ఓటు వేయకపోతే రూ.51 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తారన్నమాట.. అంటే, ఎన్నికలు వచ్చాయంటూ తప్పనిసరిగా గ్రామంలోని ఓటర్లు అంతా ఓటెయ్యాల్సిందే. దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ నిబంధనలను పాటిస్తూ వస్తోంది ఆ గ్రామం..

మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ ఊర్లో ఏ ఇంటికి తాళాలు కనిపించవు, ప్రజలెవరూ తమ ఇళ్లకు తాళాలు వేయరు.. అంతేకాదు.. ఏదైనా షాపు నిర్వహకుడు మధ్యాహ్నం భోజనానికి వెళ్లినా.. ఆ షాపు తీసే ఉంటుంది.. సదరు వినియోదారుడు తనకు కావాల్సిన వస్తువు తీసుకొని.. దానికి అయ్యే మొత్తాన్ని అక్కడ పెట్టి వెళ్తారట.. తాళాలు వేయకుండా ఉన్నా.. ఇప్పటివరకు తమ గ్రామంలో ఒక్క సారిమాత్రమే దొంగతనం జరిగిందని, అదికూడా మరిసటి రోజే ఆ దొంగ గ్రామాపంచాయతీ ముందు లొంగిపోయాడని చెబుతున్నారు ఆ గ్రామస్తులు.. ఇక, ప్రజల కోసం గ్రామపంచాయతి నిబంధనలు అమలుచేస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్‌ పడేసినా, గుట్కా తిన్నా రూ.51 ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది.. మద్యం సేవించినా, చెట్లను నరికినా, కొట్టివేసినా, పోలీసుకు ఫిర్యాదు చేయడం కానీ, కోర్టులో కేసు వేయడం చేసినా.. మూఢనమ్మకాలను ప్రోత్సహించినా, బాణాసంచా కాల్చినా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.. భూములను ఆక్రమించడం, బహిరంగంగా ఎవరినైనా దూషించినా రూ.251 జరిమానా తప్పదు.. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా బోర్డులు దర్శనమిస్తుంటాయి.. నిబంధనలను గుర్తుచేస్తుంటాయి.