NTV Telugu Site icon

Uttar Pradesh Crime: 10 రోజులు మనవడి శవంతో గడిపిన అమ్మమ్మ.. అలా బయటపడ్డ రహస్యం

Woman With Dead Body

Woman With Dead Body

Elderly Woman Spends 10 Days With Grandson Dead Body In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు తన మనవడి మృతదేహంతో 10 రోజుల పాటు గడిపింది. ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వీధి మొత్తం వ్యాపించడంతో, అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా.. అక్కడి దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు. లోపల ఓ యువకుడి మృతదేహం పడి ఉండటం చూసి షాకైన పోలీసులు.. ఆ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బారాబంకిలోని కొత్వాలి పట్టణం మొహల్లా మొహరిపూర్వాలో ఈ ఘటన జరిగింది.

Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?

ఆదివారం సాయంత్రం వీధి మొత్తం దుర్వాసన రావడం ప్రారంభమైంది. అందరూ బయటకొచ్చి, ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తోందని ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పుడే ఓ వృద్ధురాలి నుంచి ఆ దుర్వాసన వస్తోందని గుర్తించారు. అప్పుడు వాళ్లు మరో క్షణం ఆలస్యం చేయకుండా, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ కాలనీకి చేరుకొని, దుర్వాసన వస్తున్న ఇంటి వద్దకు వెళ్లారు. వాళ్లు తలుపు తట్టగా.. ఓ వృద్ధురాలు డోర్ తీసింది. డోర్ తీయగానే.. లోపల నుంచి భయంకరమైన దుర్వాసన వచ్చింది. పోలీసులు మాస్క్ ధరించి, ఆ ఇంట్లో తనిఖీ చేశారు. అప్పుడు వారికి ఓ గదిలో, కూలర్‌కు సమీపంలో ఉన్న పరుపుపై యువకుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం పురుగులు పడి, కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ దృశ్యాన్ని చూసి.. పోలీసులు వాంతులు కూడా చేసుకున్నారు.

Kissing Street: ఆ గల్లీకి వెళ్తే ముద్దులే ముద్దులు.. ఈ కిస్సింగ్ స్ట్రీట్‌ ఎక్కడో తెలుసా..?

పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మనవడి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నావని ఆ వృద్ధురాల్ని ప్రశ్నించారు. ఆమె ఎమోషనల్ అయ్యింది కానీ, పోలీసుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం పంపించగా.. ఆమె మానసిక స్థితి బాగోలేదని తెలిసింది. ఆ యువకుడు 10 రోజుల క్రితమే మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే.. అతని మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. మనవడి మీద ప్రేమతో, అతని శవాన్ని ఆ వృద్ధురాలి ఇంట్లోనే ఉంచుకుందని పేర్కొన్నారు. అంతేకాదు.. మనవడి మృతదేహానికి రోజూ స్నానం చేసేదని తెలిసింది.