NTV Telugu Site icon

Madhya Pradesh: భార్యని చంపి వ్యక్తి ఆత్మహత్య, మనవడి చితిలో దూకిన తాత..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదకర సంఘటన జరిగింది. మనవడి చితిలోకి దూకి తాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని సిధి జిల్లాలోని బహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రాయమంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అభయ్ రాజ్ యాదవ్(34) అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్(30)ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారి అంత్యక్రియల సమయంలో అభయ్ తాత కూడా అతడి చితిలోకి దూకి మరణించాడు.

Read Also: Samyuktha Menon : మహిళా దినోత్సవం.. ‘షార్ట్ ఫిలిం’ సమర్పించిన గోల్డెన్ లెగ్ బ్యూటీ

శుక్రవారం సాయంత్రం వీరి అంత్యక్రియలు జరిగే సమయంలో ఈ ఘటన జరిగిందని డీఎస్పీ గాయత్రి తివారీ చెప్పారు. మనవడు అభయ్ రాజ్ మరణంతో అతడి తాత రమావతార్ తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె వెల్లడించింది. శనివారం ఉదయం మండుతున్న చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిపోయిన మృతదేహం చితిపై దొరికినట్లు పోలీసులు తెలిపారు. సవిత హత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.