Site icon NTV Telugu

Yamuna River: య‌మునా వరదల ఎఫెక్ట్‌.. ఢిల్లీకి 2 రోజులు నీళ్లు బంద్

Yamuna River

Yamuna River

Yamuna River: ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. య‌మునా న‌ది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ ప‌రిస‌రాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీవాల్ ఆఫీసు కూడా జ‌ల‌మ‌యం అయ్యింది. ఇక వజీరాబాద్ వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీట మునిగింది. దీంతో ఆ ప్లాంట్‌ను మూసివేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీకి తాగు నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది.

Read also: Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!

యమునా న‌ది రికార్డు స్థాయిలో ప్రవ‌హిస్తున్న కార‌ణంగా.. ఢిల్లీలోని వ‌జీరాబాద్ వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మూసివేశారు. య‌మునా న‌దిలో నీటి స్థాయి పెర‌గ‌డంతో ఆ ప్లాంట్‌ను బంద్ చేశారు. ఇవాళ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆ ప్లాంట్‌ను విజిట్ చేశారు. తొలిసారి య‌మునా న‌దిలో ఈ స్థాయిలో నీరు వ‌చ్చిన‌ట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. పంపులు, మెషీన్లలోకి నీరు ప్రవేశించ‌డం వ‌ల్ల మూడు వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేసిన‌ట్లు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీని కార‌ణంగా ఢిల్లీలో సుమారు 25 శాతం నీటి స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న తెలిపారు. బోర్లను కూడా మూసివేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఒక‌టి లేదా రెండు రోజుల పాటు ఢిల్లీలో నీటి కొర‌త ఏర్పడే అవ‌కాశం ఉన్నట్లు సీఎం తెలిపారు. శుక్రవారం సాయంత్రం త‌ర్వాత మ‌ళ్లీ నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్దర‌ణ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నట్లు సీఎం కేజ్రీ వెల్లడించారు.

Read also: HBD Sanjosh: హీరో సంజోష్ కొత్త చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్

కేంద్ర జ‌ల సంఘం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు య‌మునా న‌ది ప్రవాహం హెచ్చు స్థాయికి చేరుకుంటుంద‌ని.. ఆ త‌ర్వాత నీటి మ‌ట్టం త‌గ్గడం ప్రారంభం అవుతుంద‌ని సీఎం తెలిపారు. ఢిల్లీలో యమునా నీటి మ‌ట్టం 208.46 మీట‌ర్ల స్థాయికి చేరుకున్నది. సీఎం కేజ్రీవాల్ ఇంటి చుట్టు కూడా యమునా న‌ది నీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియేట్ క్యాంప‌స్‌లోనే కేజ్రీవాల్ ఇల్లు ఉన్నది. ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, సీనియ‌ర్ అధికారుల ఇండ్లు కూడా అక్కడే ఉన్నాయి. రాజ్‌ఘాట్ నుంచి సెక్రటేరియ్‌కు వెళ్తున్న రోడ్డు జ‌ల‌మ‌యం అయ్యింది. య‌మునా బ్యాంక్ మెట్రో స్టేష‌న్‌ను క్లోజ్ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version