Site icon NTV Telugu

Oil Prices: గుడ్‌న్యూస్‌.. వంట నూనె ధరలు లీటర్‌పై రూ. 12 తగ్గింపు..!

Oil Prices

Oil Prices

వంట నూనెల ధరలు ఎప్పుడూ లేని విధంగా ఆల్‌టైం హై రికార్డులను తాకాయి.. అసలు ఈ రోజు ఉన్న ధర.. రేపు ఉంటుందా? అంటే చెప్పడం కూడా అనుమానమే అనే తరహాలో.. రోజురోజుకీ పైపైకి ఎగబాకుతూ పోయాయి.. అయితే, అంతర్జాతీయ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలతో సామాన్యులకకు కాస్త ఊరట కలిగిస్తూ.. వంట నూనెల ధరలు తగ్గుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. వినియోగదారులకు మరో శుభవార్త.. ఆయిల్ ధరలు రూ.10-12 వరకు తగ్గే అవకాశం ఉంది.. మే నుండి, ఖర్చులు మరియు స్టాక్‌లపై చర్చించడానికి కేంద్రం.. ఆయిల్‌ ఉత్పత్తిదారులతో మూడుసార్లు సమావేశమైంది. జూలై 6న సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రిటైల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను అభ్యర్థించింది. ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖతో గురువారం జరిగిన సమావేశం తర్వాత ఆయిల్‌ ఉత్పత్తిదారులు.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మరింత తగ్గింపునకు ఆమోదం తెలిపాయి.. లీటర్‌పై 10 నుండి 12 రూపాయల వరకు తగ్గించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ ప్రతినిధులను కోరినట్లుగా, రాబోయే రెండు వారాల్లో అన్ని ప్రధాన బ్రాండ్‌ల వంట నూనెల ధరపై లీటర్‌కు రూ.10-12 ఉపశమనం లభించనుంది.

Read Also: Russia-Ukraine: రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్‌ అమ్మాయి.. అక్కడ వార్.. ఇక్కడ ప్యార్

ప్రపంచవ్యాప్త ధరలను తగ్గిన నేపథ్యంలో వంట నూనెల తయారీదారులు ఎడిబుల్ ఆయిల్ ధరలను మరింత తగ్గించేందుకు అంగీకరించారని.. లీటర్‌ వంట నూనెపై రూ. 10–12 వరకు తగ్గే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.. “మేం ఆయిల్‌ ఉత్పత్తిదారులతో చర్చలు జరిపాం.. మరియు గణాంకాలతో కూడిన పూర్తి వివరాలను ప్రదర్శించాం.. దీంతో, వారు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిపారు.. అయితే, భారతదేశంలో వంటనూనెలో మూడింట రెండు వంతుల వరకు దిగుమతి చేసుకుటుంది.. ఇటీవల రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య సంక్షోభం , ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత రెండు నెలల్లో ఇండోనేషియా తన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసినందున, అంతర్జాతీయ ధరలు తగ్గాయి, అందువల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇక, మే నుండి, ఖర్చులు మరియు స్టాక్‌లపై చర్చించడానికి కేంద్రం.. ఆయిల్‌ ఉత్పత్తిదారులతో మూడుసార్లు సమావేశమైంది. జూలై 6న తయారీదారులతో సమావేశం తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రిటైల్ ధరలను తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కోరింది.. భారత్‌.. ఇండోనేషియా మరియు మలేషియా నుండి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. సన్‌ప్లవర్‌ మరియు సోయా నూనెలు ఎక్కువ భాగం ఉక్రెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్ మరియు రష్యా నుండి వస్తాయి.. ప్రతి ఏడాది దాదాపు 13 మిలియన్ టన్నుల ఎడిబుల్ ఆయిల్ భారతదేశంలోకి దిగుమతి అవుతుంది… ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండడం.. దిగుమతి ధరల తగ్గుదల కారణంగా దిగుమతి చేసుకున్న వంట నూనెల గరిష్ట రిటైల్ ధర ఒక వారంలో లీటరుకు 10 రూపాయల వరకు తగ్గుతుందని ప్రభుత్వం జూలైలో ప్రకటించిన విషయం విదితమే.

మార్కెట్ గణాంకాల ప్రకారం, పామాయిల్ ధరలు ఒక నెల ముందు నుండి జూలై 29న టన్నుకు 14 శాతం తగ్గి1,170 డార్లకు చేరుకున్నాయి. సోయాబీన్ మరియు సన్‌ ప్లవర్‌ నూనెలకు కూడా ఇదే విధమైన తగ్గుదలను నమోదు చేశాయి.. ఇప్పుడు వాటి ధర వరుసగా టన్నుకు 1,460 డాలర్లు, మరియు 1,550 డాలర్లుగా ఉన్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గడం మరియు దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల వంట నూనె ఉత్పత్తిదారులు ధరలు తగ్గించారు. దేశంలో అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిదారు, అదానీ విల్మార్ లిమిటెడ్, ఫార్చ్యూన్ బ్రాండ్ క్రింద విక్రయించే వస్తువుల ధరను 10 తగ్గించింది. ధరలను తగ్గించడానికి మరియు వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి 2024 వరకు ముడి పొద్దుతిరుగుడు మరియు సోయాబీన్ నూనెను ఏటా 20 లక్షల మెట్రిక్ టన్నులు పన్ను లేకుండా దిగుమతికి కేంద్రం అనుమతించింది. సోయాబీన్ మరియు ముడి పామాయిల్ దిగుమతి ఖర్చును కూడా ప్రభుత్వం తగ్గించింది.

Exit mobile version