Site icon NTV Telugu

Abhishek Banerjee : జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతా: అభిషేక్ బెనర్జీ

Abhishek Banerjee

Abhishek Banerjee

Abhishek Banerjee : పశ్చిమబెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జూలై 8న జరగనున్నాయి.. ఆ తరువాత ఎప్పుడైనా విచారణకు హాజరవుతానని ఎంపీ ఈడీకి తెలిపారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్‌ కేసులో ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు విచారణకు జరుకావాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉండాల్సి ఉన్నందున జులై 9 తరువాత ఎప్పుడైనా ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపారు.

Read also:Tirumala : తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మరో ప్రమాదం..

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున విచారణ కోసం ED ముందు హాజరుకాలేనని అభిషేక్ బెనర్జీ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన జూలై 9 తర్వాత ఎప్పుడైనా హాజరవుతానని తెలిపారు. తాను జూన్ 13న ఈడీ ముందు హాజరుకాలేనని.. కీలకమైన పంచాయతీ ఎన్నికలకు ముందు ఈడీ ముందు హాజరయ్యేందుకు సమయం లేదన్నారు. జూలై 9న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయని.. ఆ తర్వాత ఎప్పుడైనా హాజరవుతానని ఆయన చెప్పారు. తనకు ఈడీ సమన్లు ​​పంపడం పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచేందుకు బీజేపీ ఉ ద్దేశపూర్వంగా చేసిన పన్నాగమన్నారు. రాజకీయంగా బీజేపీ పోరాడలేక నన్ను ప్రచారానికి దూరంగా ఉంచేందుకు పన్నిన కుట్ర అన్నారు.

Read also: Extra Marital affair: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్ హోల్ లో దాచిన ప్రియుడు

గత నెలలో ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో అభిషేక్ బెనర్జీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు కలకత్తా హైకోర్టు కేంద్ర ఏజెన్సీలకు అనుమతి ఇచ్చింది. తాను బిజెపిలో చేరితే వజ్రంలాగా బయటకు వచ్చేవాడినని ఎంపీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా శారద, నారద, టెట్ స్కామ్‌లపై దర్యాప్తు చేస్తున్నారని వాటి నుంచి ఎంత మేరకు ఫలితం వచ్చిందని ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరనని.. తను ఎవరికి తల వంచనని.. రాయల్ బెంగాల్ టైగర్‌గా బతుకుతానని అభిషేక్‌ చెప్పారు.

Read also: Wrestlers : రెజ్లర్లకు క్లీన్ చీట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్
గత ఏడాది మేలో, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) మరియు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ (గ్రూప్ సి మరియు డి) మరియు టీచింగ్ స్టాఫ్ నియామకంపై విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించింది. 2014 మరియు 2021 మధ్య. ఎంపిక పరీక్షల్లో విఫలమైన తర్వాత ఉద్యోగాలు పొందేందుకు నియమితులైన వారు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు.
2014 మరియు 2021 మధ్య పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని నియమించడానికి ఉద్యోగ ఆశావహుల నుండి టిఎంసి నాయకులు రూ. 100 కోట్లకు పైగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి

Exit mobile version