National Herald Case: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు గుప్పించింది. ఈ నేరంలో వీరు 142 కోట్ల రూపాయల లబ్ధి పొందారని పేర్కొనింది. ఈరోజు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ తరపు లాయర్ ఈ వాదనలు వినిపించారు.
Read Also: Thug Life : ‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కమల్..!
అయితే, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో సోనియా, రాహుల్ గాంధీలకి గతంలో పలుమార్లు ఈడీ అధికారులు విచారణ చేశారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి నడిపించారన్న ఫిర్యాదులతో ఈడీ, సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు స్టార్ట్ చేసింది.
Read Also: Jairam Ramesh: ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది..
కాగా, ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, లక్నో భవనాలకు ఈడీ నోటీసులు అంటించినట్లు తెలిపింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని వెల్లడించింది. అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని చెప్పింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. అందులో కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను వెల్లడించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేయగా.. దీనిపై తాజాగా విచారణ కొనసాగింది.
