NTV Telugu Site icon

IT Layoffs: ఆర్థికమాంద్యం భయాలు.. ఐటీ రంగంలో సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు

It Layoffs

It Layoffs

IT Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని అంచానా వేసింది. గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రపంచం అంతా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ ఒకేసారి మందగిస్తాయని అంచానా వేస్తున్నారు.

భయపెడుతున్న ఆర్థిక మాంద్యం

2021 ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే 2022 లో 3.2 శాతం, 2023లో 2.7 శాతానికి తగ్గుతుందని గత అక్టోబర్ నెలలో రిలీజ్ చేసిన అంచనాల్లో ఐఎంఎఫ్ పేర్కొంది. చైనాలో కోవిడ్ కల్లోలంతో వచ్చే రెండు నెలల్లో వృద్ధి రేటు మైనస్ లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 40 ఏళ్లలో తొలిసారి చైనా వృద్ధి ప్రపంచ వృద్ధి కన్నా దిగువకు రాబోతోంది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్భనంతో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దీంతో 2008లో ఏర్పడిన మాంద్యంతో పోలిస్తే ఈ సారి మరింత తీవ్రంగా ఆర్థిక మాంద్యం వస్తుందని తెలుస్తోంది. బ్రిటన్ బ్రెగ్జిట్ తర్వాత నైపుణ్యం ఉన్న వారి కొరత ఏర్పడటం, వాణిజ్య రాయితీలను కోల్పోవడం కూడా బ్రిటన్ ఆర్థిక మందగమనానికి కారణం అయింది. ప్రస్తుతం ప్రజల వద్ద ఎక్కువగా డబ్బు ఉండేలా బ్రిటన్ చర్యలు తీసుకుంటోంది.

Read Also: Google Layoff: ఐటీ ఉద్యోగాలు ఊస్ట్.. 12,000 మందిని తొలగించనున్న గూగుల్

ఐటీలో సంక్షోభం

ఆర్థిక మాంద్యం ముందుగా ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది దేశీయంగా ఐటీ ఉద్యోగుల్లో కూడా భయాలను రేపుతోంది. మెటా, ట్విట్టర్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికే మెటాలో 13 శాతం అంటే 11,000 మంది, ట్విట్టర్ 3700 మందిని, గూగుల్ 12,000 మందిని, అమెజాన్ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రాబోయే ఏడాది వరకు ఉద్యోగ నియామకాలు ఉండవని తెలుస్తోంది. దేశంలో బైజూస్, స్నాప్ చాట్, స్విగ్గీ కూడా కొలువులను ఊడపీకుతోంది. ఇంటెల్, స్నాప్ లో 20 శాతం, రాబిన్ హుడ్ లో 13 శాతం, సేల్స్ ఫోర్స్ 2 వేల మందిని, బైజూస్ 2,500 మందిని ఇంటికి పంపారు.

ఇండియన్ ఐటీ ఉద్యోగుల్లో దడదడ..

ఇండియాలో ఐటీ ఉద్యోగం అంటే ఓ కల. సమాజంలో ఓ రెస్పెక్ట్. మంచి జీతం, మంచి జీవితం ఇలా ఆ రేంజే వేరు. కానీ పరిస్థితి మారబోతోంది. దేశంలో కూడా ఐటీ ఉద్యోగుల్లో లేఆఫ్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ ఐటీ కంపెనీలు కూడా త్వరలోనే లేఆఫ్స్ ప్రకటిస్తాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేసుకుని జాబ్ లెటర్స్ ఇవ్వడం లేదు. కొన్ని ఇండియన్ కంపెనీలు 20 శాతం దాకా లేఆఫ్స్ ఇస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. టీసీఎస్ సంస్థ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అసలు మాంద్యం ప్రభావం వస్తే ఉద్యోగాలు మరిన్ని కోల్పోయే అవకాశం ఉంది.  భారతదేశంలోని ఐటీ పరిశ్రమకు యూరప్, అమెరికానే పెద్ద మార్కెట్. అక్కడి ఆర్థిక పరిస్థితులు ఇండియా ఐటీ సెక్టార్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఇది కేవలం ఒక ఐటీ సెక్టార్ కే కాదు ఎలక్ట్రానిక్స్,  మాన్యుఫాక్చరింగ్, టెలికాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా పలు రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల నుంచి ఏడాది లోగా ఆర్థికమాంద్యం ఉంటుందని కంపెనీలకు తెలిసిపోయింది. దీంతోనే అన్ని కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి.

Show comments