ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
- SIRపై ఎన్నికల సంఘం కీలక సమావేశం
- CEC జ్ఞానేష్ కుమార్, సంధు, వివేక్ జోషి హాజరు
- కమిషనర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
- నోటీసులు అందుకున్న వారి వద్దకే బీఎల్ఓలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ECI SIR Meeting: కేంద్రం ఎన్నికల సంఘం కీలక సమావేశం శనివారం నిర్వహించింది. కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే మీడియా నివేదిలక నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్ఐఆర్ అభ్యంతరాలపై నవంబర్ 30వ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ హాజరయ్యారు.
శనివారం న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ఈ సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపైనే ఈ భేటీ జరిగింది. ఢిల్లీలో ఎస్ఐఆర్ అభ్యంతరాలపై గడువును అక్టోబర్ 30 వరకు, మహారాష్ట్రలో అక్టోబర్ 12 వరకు గడువు పెంచింది. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న వారు బీఎల్ఓలను కలవాల్సిన అవసరం లేదని ఈసీ ప్రకటించింది. బీఎల్ఓలే ఓటర్ల ఇంటికి వస్తారని ప్రకటించింది. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తారని చెప్పింది. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఇబ్బంది లేకుండా సులభతర విధానాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సర్ నోటీసులు వస్తే వ్యక్తిగత విచారణకు రావాాల్సిన అవసరం లేదని, ఫామ్ -6 డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పింది. ఎస్ఐఆర్కు సంబంధించిన ఫామ్-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయంతోనే ప్రారంభమైందని చెప్పింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తైందని వెల్లడించింది.
Also Read
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ఎస్ఐఆర్, ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి అంశాల్లో కమిషనర్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముగ్గురు కమిషనర్లు ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించడంతో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు, ప్రతిపక్షాలు ఈసీ పనితీరు, CEC జ్ఞానేష్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. CEC రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 30న ఇండియా కూటమి కీలక సమావేశానికి పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?