తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీ సేవా ద్వారా రేషన్ కార్డుల జారీని ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వచ్చిన మీడియా కథనాలను ఈసీ తప్పుపట్టింది. ఈ వార్తలు తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి ప్రసారాలు తప్పు అని కొట్టిపారేశారు. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ గానీ, మీసేవా గానీ మమ్మల్ని సంప్రదించలేదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నిర్ద్వందగా ఖండిస్తున్నామన్నారు. తప్పులను సరిదిద్దాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెల 26న గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అటు పౌరసరఫరాల శాఖ సైతం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంరత ప్రక్రియ అని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభిచాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశించింది.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిలిపివేసిందంటూ వార్తలు రావడంతో ఈసీ స్పందించి కొట్టిపారేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: New Ration Cards: ‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు.. పౌరసరఫరాల శాఖ ఏం చెప్పిదంటే..?