NTV Telugu Site icon

Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు..

Earth Quake

Earth Quake

Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కాబూల్‌కి 241 కిలోమీటర్ల ఈశాన్య ప్రాంతంలో భూకంప కేంద్ర ఉంది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు వచ్చాయి.

Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు..

వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ ఫూంచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. పిర్ పంజల్ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్ లాహోర్ నగరం, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు అక్కడి మీడియా చెబుతోంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు.