NTV Telugu Site icon

Election Results: ఎర్లీ ట్రెండ్స్‌.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దూసుకుపోతున్న బీజేపీ..

Fdsfd

Fdsfd

Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సీట్ల సంఖ్య ప్రత్యర్థి పార్టీల కన్నా ఎక్కువగా ఉంది.

Read Also: Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ 15 స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. జార్ఖండ్‌లోని 81 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ కూటమి 25 స్థానాల్లో, కాంగ్రెస్+జేఎంఎం 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కొప్రి నుంచి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ లీడింగ్‌లో ఉన్నారు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ బర్హత్ స్థానం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.