DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP సంచనల విజయం..
- DUSU లో మూడు కీలక పోస్టుల్ని దక్కించుకున్న ఏబీవీపీ..
- ఉపాధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి విజయం..
- ఏబీవీపీ ఖాతాలో అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DUSU Elections: దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే విద్యార్థి ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) సత్తా చాటింది. ABVP అధ్యక్ష పదవితో సహా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ABVP, NSUI మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఒకానొక దశలో NSUI అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ చివరకు ABVP అభ్యర్థులు నాలుగు కీలక స్థానాల్లో మూడింటిని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), AISA-SFI కూటమి మధ్య జరిగిన తీవ్ర పోటీ తర్వాత ఈ ఫలితాలు వచ్చాయి.
DUSU అధ్యక్షుడిగా యశ్ దాబాస్..
ABVPకి చెందని యశ్ దాబాస్, NSUI అభ్యర్థి విజయ్ శంకర్ మీనాల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. 20వ రౌండ్ పూర్తయ్యే సరికి యశ్ విజయం సాధించారు. యశ్‌కు మొత్తం 24,576 ఓట్లు రాగా, విజయ్ శంకర్ మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి.
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
సెక్రటరీగా రియా చబాడి, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. యూనివర్సిటీ నాలుగు కేంద్ర ప్యానెల్ స్థానాల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించారు.
జెన్-జీ ఉద్యమం తర్వాత తొలి తీర్పు..
నీట్ పేపర్ లీక్ ఉద్యమం తర్వాత జరిగిన తొలి స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది. ఎన్ఎస్యూఐ పోటీ ఇచ్చినప్పటికీ, అది సరిపోలేదు. ఈ విజయం ద్వారా బీజేపీ గెలిచినట్లు అవుతుంది. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ గెలవడంతో ఇప్పుడు ఆ పార్టీ జెన్-జీ, యువత తమకు మద్దతుగా ఉన్నట్లు చెప్పుకుంటుంది.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!