Akhilesh Yadav: ‘‘ఏం తమ్ముడు, నీకు వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ జర్నలిస్టుకు అఖిలేష్ బెదిరింపు, వీడియో వైరల్..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌ని సమాజ్‌వాదీ(ఎస్పీ) బద్దలు కోట్టింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే ఎస్పీకి అధికంగా ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు రాగా, ఎస్పీకి 37 సీట్లు దక్కాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖిలేష్ యాదవ్‌కి సంబంధించిన ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఓ జర్నలిస్టును బెదిరించిన వీడియో బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, అఖిలేష్ అతడిని బెదిరిస్తూ వ్యాఖ్యానించాడు.

Read Also: CM Revanth Reddy: రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

‘‘ఎందుకు ఇలా చేస్తున్నావు తమ్ముడు, నేను మీకు మరో ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ అని బెదిరిస్తుండటం ఇందులో చూడవచ్చు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు. ఈ వీడియోపై బీజేపీ విరుచుకుపడింది. బీజేపీ నేత సుధాన్షు త్రివేది దీని గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘‘ అఖిలేష్ యాదవ్ పోకిరి భాష వాడుతున్నాడు’’ అని విమర్శించారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, అఖిలేష్ యాదవ్ తన గుండాల భాషను ఉపయోగించడం ప్రారంభించారు. కెమెరా, మీడియా ముందు ఒక జర్నలిస్టుని బెదిరించాడని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి గ్యాంగ్‌స్టర్ల పాలనను వ్యాప్తి చేసి ఉంటారో ఒక్కసారి ఉహించుకోండి అని అన్నారు.