Site icon NTV Telugu

Air India: హైదరాబాద్-దుబాయ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Airindia

Airindia

Dubai-Bound Air India Flight Diverted To Mumbai After Technical Glitch: భారత విమాన పరిశ్రమను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా భారత్ కు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 ఏఐ-951 విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. ఎల్లో హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినడంతో ముంబైకి అత్యవసరంగా మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు తెలిపారు. మొత్తం 143 మంది ప్రయాణికులతో విమానం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తోంది.

Read Also: Pakistan: భారత్‌కు పాకిస్తాన్ లీడర్ “అణు యుద్ధం” బెదిరింపులు..

డిసెంబర్ 2న ఇలాగే కన్నూర్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండోగో విమానంలో లోపం తలెత్తడంతో ముంబైకి మళ్లించారు. ఎల్లో హైడ్రోజన్ లీక్ కారణంగా అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. దీనికి ముందు జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్లే స్పైస్ జెట్ విమానంలో కూడా ఇలాగే సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొచ్చికి మళ్లించారు. జెడ్డాలో టేకాఫ్ అయిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రన్ వేపై కొన్ని టైర్ ముక్కలు కనిపించడంతో పైలెట్ కు సమాచారం అందించారు. అయితే కొచ్చిన్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

Exit mobile version