Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
- NSUI నేత అనస్ ఖాన్‌పై విద్యార్థిని సంచలన ఆరోపణలు..
- రాహుల్ గాంధీ మార్చ్‌లో పాల్గొంటే స్టూడెంట్స్‌కు రూ. 500..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi University: కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నేత అనస్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘‘సేవ్ డెమోక్రసీ మార్చ్’’లో పాల్గొంటే విద్యార్థులకు రూ. 200 నుంచి రూ. 500 వరకు ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆరోపించింది. ఇదే కాకుండా కాలేజ్ గ్రూపుల్లో కొత్తగా చేరిన విద్యార్థినులను ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులకు పరిచయం చేయడంతో, అందుకు ప్రతిఫలంగా డబ్బులుు చెల్లిస్తామని అభ్యంతరకరమైన సందేశాలు పంపినట్లు ఆమె ఆరోపించింది. ఈ విషయాలను సదరు విద్యార్థిని నేషనల్ మీడియాతో పంచుకుంది.
రాహుల్ గాంధీ చేపట్టిన మార్చ్‌లో పాల్గొంటే, విద్యార్థులకు నగదుతో పాటు ఉచిత భోజనం, రవాణా సౌకర్యాలు, రిఫ్రెష్మెంట్లు అందిస్తామని అనస్ ఖాన్ ఆశ చూపించినట్లు ఆరోపించారు. కొందరికి ఉచిత రాపిడో రైడ్లు, జొమాటో ఆఫర్లు కూడా ఇస్తామని చెప్పినట్లు ఆరోపించింది. అనస్ ఖాన్ సుమారుగా 100 మంది కాలేజీ స్టూడెంట్స్ ఈ మార్చ్‌లో పాల్గొనేలా ప్రయత్నించినట్లు విద్యార్థిని ఆరోపించింది. ఇందుకోసం కాలేజీ గ్రూపుల్లో మెసేజ్‌లు చేసినట్లు చెప్పింది.
Also Read
- Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
ఇదే కాకుండా అనస్ ఖాన్ కాలేజీ గ్రూపుల్లో కొత్తగా చేరిన విద్యార్థినులకు సంబంధించి అభ్యంతరకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. మంచి శారీరక ఆకృతి ఉన్న యువతుల్ని ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులకు పరిచయం చేస్తామని, వారికి మంచి కంపెనీ ఇస్తే రూ. 10 వేల నుంచి రూ. 30 వేలు ఇస్తామని మెసేజ్‌లు పంపేవాడని సదరు విద్యార్థిని ఆరోపించింది. ఈ ఆఫర్ కోసం 22 ఏళ్ల లోపు వయసు, మంచి ఫిజిక్, అందం వంటి నిబంధనలు పెట్టినట్లు ఆరోపించింది. అంతేకాకుండా, కొందరు యువతులకు అహ్మదాబాద్ వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్లు, దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీకి వీవీఐపీ టికెట్లు ఇస్తామని కూడా చెప్పినట్లు ఆమె ఆరోపించింది.
ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ నస్పై NSUI చర్యలు తీసుకోలేదని కూడా విద్యార్థిని విమర్శించింది. కాలేజీ కార్యకలాపాల్లో అనస్ చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తొలగించలేదని ఆరోపించింది. ఒత్తిడి పెరగడంతో అనస్ స్వయంగా రాజీనామా చేసినట్లు తెలిపింది. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని విద్యార్థిని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
-
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!