Site icon NTV Telugu

Drunk Soldier: తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన..

Urine

Urine

తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ఫిర్యాదు చేస్తే వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మరియు రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. ఆమె రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కుమారుడు, భర్త ఉన్నారని.. బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ పేర్కొంది.

Read Also: Delhi water crisis: నీటిని విడుదల చేయాలని హర్యానా సర్కార్‌కు ఆప్ విజ్ఞప్తి

సైనికుడికి పై బెర్త్ కేటాయించగా, మహిళకు లోయర్ బెర్త్ కేటాయించారు. సైనికుడు పూర్తిగా మత్తులో ఉన్నాడని, అతని బెర్త్‌పై అపస్మారక స్థితిలో పడుకున్నాడని.. పై బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన భర్తకు సమాచారం అందించడంతో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్‌, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫోటోలు తీసి, ఎటువంటి చర్య తీసుకోకుండా వెళ్లిపోయారు. మరోవైపు.. ఆర్‌పిఎఫ్ ఇన్‌ఛార్జ్ అధికారి సంజయ్ ఆర్య ఈ సంఘటనను అంగీకరించారు. సైనికుడు మత్తులో ఉన్నాడని.. అతని ప్యాంటు తడిగా ఉందని ధృవీకరించారు. అయితే B-9 కోచ్‌లోని సీట్ నంబర్ 23లో మహిళా కనిపించలేదని పేర్కొన్నారు.

Read Also: Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?

Exit mobile version