NTV Telugu Site icon

Droupadi Murmu: ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్లనున్న రాష్ట్రపతి.. ఏఏ దేశాలంటే..!

Droupadimurmutour

Droupadimurmutour

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: Mahrang Baloch: బలూచిస్తాన్‌ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..

ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలిలీ కటోనివెరే ఆహ్వానం మేరకు ఫిజీని ముర్ము సందర్శిస్తారు. 05-06 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. భారతదేశం నుంచి ఒక దేశాధినేత ఫిజీకి వెళ్లడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ ముర్ము ఆగస్టు 2024, 07-09న న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డామ్ సిండి కిరో ఆహ్వానం మేరకు న్యూజిలాండ్‌ను సందర్శిస్తారు. అలాగే అధ్యక్షుడు జోస్ రామోస్-హోర్టా ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ ముర్ము 10 ఆగస్టు, 2024న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్-లెస్టేను సందర్శించనున్నారు. అనంతరం ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

ఇది కూడా చదవండి: TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం