Site icon NTV Telugu

Bhopal Accident: కారు నడుపుతూ రీల్స్‌ చూసిన డ్రైవర్‌.. కాలువలో పడి ఇద్దరు మృతి

Bhopal

Bhopal

Bhopal Accident: ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చాలా మంది ట్రై చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్‌ రీల్స్‌ పిచ్చి వల్ల తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించగా.. మరొకరు అతి కష్టం మీద తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్ లో చోటు చేసుకుంది.

Read Also: Fire Accident: షేక్‌పేట్‌ రిలయన్స్‌ ట్రెండ్స్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు!

అయితే, వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని కోలార్ రోడ్‌లో బుధవారం నాడు అర్థరాత్రి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులు పలాష్ గైక్వాడ్, వినీత్ దక్ష (డ్రైవర్‌)గా గుర్తించారు. అయితే, డ్రైవర్‌ కారు నడుపుతూ రీల్స్‌ రికార్డ్ చేస్తుండగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో, పలాష్‌, వినీత్‌ అక్కడికక్కడే మరణించగా.. ప్రమాదం సమయంలో మరో వ్యక్తి పియూష్ కారు వెనుక అద్దాన్ని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక, సమాచారం అందుకున్న కోలారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు అద్దాలు పగలగొట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.

Exit mobile version