Site icon NTV Telugu

Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..

Drone Missile

Drone Missile

Drone Missile: భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిస్సైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెస్ట్ సెంటర్‌లో డ్రోన్ నుంచి ప్రిసెషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలులో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను నిర్వహించింది.

Read Also: Air India Crash: బోయింగ్ ఇంధన వ్యవస్థలో లోపం లేదు.. యూఎస్ ఏవియేషన్ సంస్థ..

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓని అభినందించారు. ఈ పరీక్ష భారత దేశ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచిందని అన్నారు. ULPGM-V2ని DRDO యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) అభివృద్ధి చేసింది. ప్రయోగం విజయంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఈ ULPGM-V3 మిసైల్ ప్రత్యేకతలు:

* హై డెఫినిషన్ డ్యూయల్ చానల్ సీకర్, ఇది రోజూ, రాత్రీ టార్గెట్‌ను గుర్తించి ఆపరేట్ చేయగలదు.

* రెండు దిశల డేటా లింక్ సదుపాయం ద్వారా టార్గెట్‌ను ప్రయోగం తర్వాత కూడా అప్‌డేట్ చేయవచ్చు.

మూడు రకాల వార్‌హెడ్ మాడ్యూల్స్:

1. యాంటీ ఆర్మర్ – ఆధునిక ట్యాంకులపై దాడికి
2. పెనెట్రేషన్ కమ్ బ్లాస్ట్ – బంకర్‌లు చీల్చేందుకు
3. ప్రీ-ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ – విస్తృత ప్రభావంతో లక్ష్యాలను తుడిచివేయగల సామర్థ్యం

ఈ ప్రాజెక్టును డీఆర్‌డీవోకి చెందిన పలు ల్యాబ్‌లు కలసి అభివృద్ధి చేశాయి. ఇమారత్ రీసెర్చ్ సెంటర్, డీఆర్‌డీఎల్, టెర్మినల్ బెలిస్టిక్స్ ల్యాబ్, హై ఎనర్జీ మెటీరియల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రయోగంలో యాంటీ ఆర్మర్ వార్‌హెడ్ మోడల్‌ను పరీక్షించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మిసైల్‌ను ప్రయోగించిన UAV కూడా బెంగళూరుకు చెందిన భారతీయ స్టార్టప్ – న్యూస్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా దేశీయ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు అడాని డిఫెన్స్, భారత డైనమిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్), 30 MSMEs, స్టార్టప్‌లు సహకరించాయి. డీఆర్‌డీవో ఛైర్మన్ డా. సమీర్ వి. కామత్ మాట్లాడుతూ, ఇలాంటి శక్తివంతమైన ఆయుధాల అభివృద్ధి ఈ సమయానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు.

Exit mobile version