Kusha Missile: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన లాంగ్ రేంజ్ సర్ఫేజ్-టూ-ఎయిర్ మిస్సైల్ (LRSAM) ‘‘కుశ’’ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి తొలి ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఈ మిస్సైల్ విజయవంతం కావడంతో భారత వైమానిక రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ విషయం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. కుశా క్షిపణి యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు (UAVలు), శత్రు క్షిపణులు, భారీ వైమానిక లక్ష్యాలను వివిధ ఎత్తులు, దూరాల్లో సమర్థంగా నిర్వీర్యం చేయగలదని తెలిపారు. లాంగ్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థను స్వయంగా అభివృద్ధి చేసిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.
400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కొట్టగలదు:
కుశ ప్రాజెక్టు భారతదేశ మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో రూపొందించబడింది. ఈ క్షిపణి వివిధ వెర్షన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. గరిష్టంగా 350 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో దీనిని రూపకల్పన చేశారు. మరిన్ని టెస్టులు జరిగిన తర్వాత దీనిని భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆపరేషన్‌లోకి వస్తే భారత గగనతర రక్షణ వ్యవస్థ విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
The @DRDO_India has successfully conducted the maiden flight test of Long-Range Surface-to-Air Missile Kusha today from the APJ Abdul Kalam Island off the coast of Odisha.
Kusha missile system is capable of neutralising wide variety of aerial threats including fighter jets,… pic.twitter.com/EceUgGM1HR
— Rajnath Singh (@rajnathsingh) July 23, 2026

