Site icon NTV Telugu

Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం.. 3 రోజులు ఎన్‌ఐఏ కస్టడీకి డాక్టర్ షాహీనా

Delhi Car Blast

Delhi Car Blast

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితురాలైన డాక్టర్ షాహీనాను మూడు రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పాటియాలా కోర్టు అప్పగించింది. గత నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాది ఉమర్ కూడా హతమయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక విషయాలు రాబట్టారు. హర్యానాలోని అల్-ఫలాహ యూనివర్సిటీ వేదికగా డాక్టర్ల బృందం దేశ వ్యాప్తంగా ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.

ఇది కూడా చదవండి: PM Modi: కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

ఇందులో ముఖ్యంగా డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్, ఉమర్ కీలక సూత్రధారులుగా ఉన్నారు. అయితే కుట్ర బయటపడడంతో ఉమర్ తప్పించుకునే ప్రయత్నంలో కారులో ఉన్న బాంబ్‌లు పేలిపోయాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్ జైల్లో ఉన్నారు. తాజాగా షాహీనాను మూడు రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది.

ఇది కూడా చదవండి: Bihar: లాలూ కుటుంబంలో మళ్లీ బలపడుతున్న రక్తసంబంధం.. తండ్రిని కలిసిన తేజ్ ప్రతాప్

Exit mobile version