NTV Telugu Site icon

Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్ నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నగర వాసుల్ని ఎండలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. గత దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నగరంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్‌కి పెరిగింది. 2016లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, ప్రస్తుతం రికార్డువుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కొద్ధి దూరంలోనే ఉన్నాయి.

Read Also: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..

ప్రస్తుతం బెంగళూర్ నగరంలో సగటున ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా కనీసం 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో బెంగళూర్ నగరంలో వర్షాలు తక్కువ కురిశాయి. చలికాలంలో బెంగళూర్‌లో వర్షం పడలేదు. ప్రధానంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రుతుపవనాల కాలంలో తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేగవంతమైన పట్టణీకరణ కూడా బెంగళూర్ ఇక్కట్లకు మరోకారణమని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో పనిచేస్తున్న డాక్టర్ పువియరాసన్ తెలిపారు.

బెంగళూర్ వాసులు ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తమ దినచర్యను మార్చుకుంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బెంగళూర్‌‌లో శనివారం రాత్రి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే, ఏప్రిల్ 14 తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.