Donald Trump: భారత్‌లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం మాకు ఇష్టం లేదు: టిమ్‌కుక్‌తో ట్రంప్..
- భారత్‌లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం నాకు ఇష్టం లేదు..
- ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
ఖతార్ రాజధాని దోహాలో జరిగిన వ్యాపార కార్యక్రమంలో.. ట్రంప్ తనకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉందని అన్నారు.‘‘ మీరు భారతదేశం అంతటా ఆపిల్ కంపెనీ పెడుతున్నట్లు విన్నాను. భారత్‌లో నిర్మించాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి, కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టం’’ అని ట్రంప్ టిమ్ కుక్‌తో అన్నారు. తాను మాట్లాడిన తర్వాత ఆపిల్ అమెరికాలో తన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ చెప్పారు. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తాని బెదిరించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: Tata EV Discounts 2025: ఆఫర్ అదిరింది.. టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.86 లక్షల డిస్కౌంట్
ఇదే కాకుండా, ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకాలు లేకుండా డీల్ ఆఫర్ చేసిందని అన్నారు. అయితే, భారత్ ఇలాంటి ఆఫర్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, మాక్‌బుక్‌లను ఉత్పత్తి చేసే ఆపిల్ సంస్థ అమెరికాలో ఉత్పత్తిని విస్తరిస్తుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. చైనా నుంచి భారత్‌కి వస్తున్న ఆపిల్, భారత్‌లో వేగంగా ఉత్పత్తిని విస్తరించాలని అనుకుంటున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం, భారత్‌లో ఆపిల్‌కి మూడు ప్లాంట్లు ఉన్నాయి. రెండు తమిళనాడులో ఒకటి కర్ణాటకలో ఉంది. వీటిలో ఒకదానిని ఫాక్స్‌కాన్ నిర్వహిస్తుండగా, మిగిలిన రెండింటిని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. మరో రెండు ఆపిల్ ప్లాంట్లు నిర్మించే దశలో ఉన్నాయి. మార్చితో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరంలో, ఆపిల్ భారతదేశంలో $22 బిలియన్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తిలో 60 శాతం పెరుగుదల.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..