కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్‌పై పోరాడేందుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలోపేతమైందని తెలిపారు.
థర్డ్ వేవ్.. భయాందోళనలు సృష్టించొద్దు కేంద్రమంత్రి విజ్ఞప్తి..

Jitendra Singh