NTV Telugu Site icon

Trump Tower: భారతదేశానికి త్వరలో ట్రంప్ ఇద్దరు కుమారులు.. ఎందుకో తెలుసా..?

Trump Tower

Trump Tower

Trump Tower: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తన తొలిరోజు రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా-ఇండియాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ భారత్‌కి సన్నిహితుడనే పేరుంది. మోడీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఇరు దేశాల కీలక ఒప్పందాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ట్రంప్ ఇద్దరు కమారులు త్వరలో భారత్‌కి రానున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో నిర్మిస్తున్న ఐకానిక్ ‘‘ట్రంప్ టవర్స్’’ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూర్, నోయిడా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ట్రంప్ కుమారులు వస్తారని తెలుస్తోంది. భారతదేశంలో నిర్మిస్తున్న ట్రంప్ టవర్స్, అమెరికాలోని ట్రంప్ టవర్స్ సంఖ్యను అధిగమించబోతోంది. అమెరికా వెలుపల ఎక్కువ ట్రంప్ టవర్స్ ఉన్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉండబోతోంది.

మొత్తం 6 కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టుల్లో గోల్ఫో కోర్సు, విల్లాలు కూడా ఉంటాయి. 2025 నాటికి భారత్, జపాన్‌ని అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఈ క్రమంలో భారత్‌లో ట్రంప్ కుటుంబ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

Read Also: Donald Trump: “బర్త్ రైట్ పౌరసత్వం” రద్దు.. ఇండియన్స్‌కి ట్రంప్ బిగ్ షాక్.. ప్రభావం ఎంత..?

ట్రంప్ టవర్స్ ఏయే నగరాల్లో ఉన్నాయి..?

ముంబై, పూణే, గుర్గావ్, కోల్‌కతాలో ఉన్న 4 నివాస ట్రంప్ టవర్లు రాబోయే ఆరేళ్లలో 10కి విస్తరించనున్నాయి. నోయిడా, హైదరాబాద్, బెంగళూర్, ముంబై, గుర్గావ్, పూణేలో కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనన్నాయి. భారతదేశంలోని నాలుగు ట్రంప్ టవర్లు 3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 లగ్జరీ నివాసాలతో రూ. 6 కోట్ల నుండి రూ. 25 కోట్ల మధ్య ధరను కలిగి ఉన్నాయి, మొత్తం అమ్మకపు విలువ రూ. 7,500 కోట్లు.

హైదరాబాద్‌, బెంగళూర్ సహా 6 కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. వీటి అంచనా అమ్మకాల విలువ రూ. 15000 కోట్లు. 2017లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటానికి ముందు, లోధా, పంచ్‌షిల్ అండ్ ట్రిబెకా డెవలపర్స్ వంటి డెవలపర్‌లతో ఒప్పందాల ద్వారా ముంబై, పూణే, గుర్గావ్, కోల్‌కతాలో నాలుగు ట్రంప్ టవర్లు పూర్తయ్యాయి.